Posts

Showing posts from 2016

some of my past writings - posting at one place

Image

Respect Women..!

Image
ఆడపిల్ల ఏడ కనపడినా, సమాజమే సమముగా పంచుకుంటుంది!! ... ఎవడి కూతురో లే, కామ వాంఛ తీరటానికి, దొరికితే చాలు దొరలా చెరిచి పోతావు!! అంగడి లో వస్తువు లా అణువనువు తడిమి చూస్తావు!! అమ్మపాల రొమ్ము ని కుమ్మే నీకు ఆడతనం గుర్చే కాని అందులోని అమ్మతనం చూడలేవు!! ఎవడిచ్చాడు నీకు మగతనం ?? అమ్మతనం నుండి రాలిన రక్తమాంసమే నువ్వు మరో ఆడపిల్ల ని ఆటబొమ్మ లా కాటేస్తున్నావ్!! See More respect women, without them we are out of the imagination.. advance happy women's day...!  -jayanth

love quotes (one year back written)

సమయం లేదు  అంటూనే.. సరదాగా నీతో గడపాలని నువ్వంటే నాకిష్టం అని చెప్పాలని ఉంది.. కాని దూరం నాకు  ప్రశ్న కాకపోయినా నీ మనసులోని అపార్థానికి సమాదానం దొరకని ప్రశ్నే నన్ను నా నుండి దూరం చేస్తుంది ...!! ప్రేమను ప్రేమిస్తున్న ప్రేమగా  తన ప్రేమకై నా ప్రేమను  నేను ప్రేమించట్లేదని అనుకోని ప్రేమను ప్రేమగా ప్రేమించట్లే దంటూనే   ప్రేమిస్తూ ప్రేమలో నేను ప్రేమనై ప్రేమకోసం నన్ను నేను ప్రేమించుకుంటున్న ప్రేమను ప్రేమించకనే.. !! 04 april 2015 ప్రేమించటం... విడిపోవటానికి అయితే  .. ప్రేమకేం విలువ ఉంటుంది.. విలువలు  నిలబెట్టలేని ద్వేషం.. ఎవరికోసం, ఎందుకోసం.. !! ప్రేమకోసం ఏదైనా వదిలెయ్యొచ్చు  కాని ప్రేమను కాదు.. ! 05 april 2015 అలుపు లేదు నా మనసుకు.. నీ ప్రేమలో.. కులుకు లేదు నా  కనులకు నీ ఊహలో ... పలుకు లేదు నా మాటకు .. నీ పలకరింపులో .. మరుపు లేదు నా ప్రేమకు.. నీ నీడలో .. మలుపు లేదు నా  పాదానికి .. నీ అడుగులలో ... నీ కోసమే నేను... నీలోనే నేను..!! 05 april 2015

relationship is always needs adjustments

Image
బంధం బరువుగా అనుకునే వారికి , బంధాలు తెంచుకున్న వారికి, ఈ రోజు నేను రాసే కొన్ని మాటలు ఆలోచన కలిగిస్తే చాలు!! ముందుగా, ఓ బంధం అనేది ఏర్పడటానికి కారణాలు ఎన్నో ఉంటాయి, విడిపోవటానికి కూడా ఉంటాయనుకోండి!! కానీ ఓ మనిషికి బ్రతకటానికి డబ్బు తో పాటు బంధాలు కూడా అవసరం!! ... కాలానికి అనుగుణంగా మనం మనతో ప్రేమగా ఉన్న వారితో గడిపిన క్షణాలను కూడా వదిలేస్తుంటామ్!! కొన్ని వృత్తి రిత్యా అవ్వొచ్చు, లేక మాట పట్టింపుల వల్లనో కావచ్చు మౌనంగా దూరంగా ఉండిపోతున్నాం!! ఊపిరి పోసుకున్న దగ్గరి నుండి ఊపిరి ఆగేదాక అమ్మ అని , నాన్న అని అక్క, అన్న అని ఎన్నో బంధాలను పెనవేసుకుంటున్న మనం, స్నేహం-ప్రేమ అనే కారణాల వల్ల బిగువగా అనుబంధాలకు అల్లిక గా సాగిపోతున్నాం.కానీ ద్వేషం, అపార్థం, కోపం, మోసం, స్వార్థం అనే వాటికి చోటు ఇవ్వటం వలన ఎన్నో బంధాలు గతంగానే గతించి పోతున్నాయి. మీరు బాధ పడిన విషయం వలన కూడా కొందరిని దూరంగా ఉంచాల్సి వచ్చిండొచ్చు. ప్రేమ లేకుండా ద్వేషం, ద్వేషం రాకుండా అసహ్యం ఏర్పడదు. ప్రేమంటే అందులో మానవత్వం కూడా ఓ...

love quotes

ఉరిమే మేఘము కరిగెను చినుకులా .. కురిసే వర్షము చేరెను ఆధారాలను నేరుగా.. నిదుర లేపెను ఒక కొత్త ఉదయం చల్లగా .. నేల  తడిచెను ఆకాశంలో  హరివిల్లు జారిపడెను .. మనసు అడిగెను అలాంటి రోజు ఎప్పుడూ  కావాలని .. చిరునవ్వు చిందులేసెను ఆనందానికి అంతులు  లేవని.. చిన్నారుల కేరింతలు , కోకిల సరిగమల రాగాలు ఎంత మధురం.. అలాంటి చల్లని చినుకులలో ఆనందమే కాదు బాధను కూడా ఆస్వాదించగలం.. వర్షాన్ని, వెన్నెల ని ఒకటిగా చూడాలనే నా కోరిక ఎప్పటికి తీరునో... అలసిన కనులకు అలరించే అందం నీవు ఉదయించిన నా కనురెప్పలకు ఊరించే ఊహవు నీవు .. కరిగిన నా కన్నీటి కనులకు ఓదార్చే కానుక నీవు.. కదిలిన నా పెదాలపై వర్షించే పదాల వర్షం నీవు.. నిదురించిన నా మనసుని కదిలించిన అలల అలజడి నీవు..

Mother's Love

Image
తేనెలొలుకు పలుకులు నేర్పించు అమ్మ ప్రేమ మధురం.. చిట్టి కనులకు చంద్రుడి అందాలు చూపే  అమ్మ ఆలన మధురం.. అలసిన మన కనురెప్పల పాపలకు అమ్మ ఒడి మధురం .. కరుగుతున్న మన కన్నీరుకు అమ్మ లాలి పాట మధురం... పడి లేచిన క్షణం మనకు చేయుతనిచే  అమ్మ చెయ్యి మధురం.. గెలిచినా, ఓడినా మన వెంట నీడల ఉండే అమ్మ మనసు ఎంతో మధురం .. అమ్మ.. అంతులేని ప్రేమ ఉందా? అనే ప్రశ్నకు  సమాధానం... అమ్మ.. అలుపులేని ఆప్యాయతకు నిదర్శనం కనిపించని రూపం దేవుడు అయితే కనిపించే దేవత అమ్మ... కన్నీరులా  కరిగిపోయినా, తన జీవితం పర్లేదు నా బిడ్డ బాగుండాలి అని  అనుకునే అమాయకపు అమృతవల్లి అమ్మ...

love at first sight

రవికిరణం నేల తాకినట్లు.. నీ ప్రేమ నా మనసు చేరే ప్రియతమా. చల్లని జాబిలి వెన్నెలలా.. నీ మోము కాంచిన  క్షణం నుంచి కునుకు కరువయ్యే కనులకు... మనసు బరువయ్యే ప్రేమ పెరిగి.. చిరునవ్వు వెతికే అటుఇటు నీకు అందించుటకు .. లాలించే అమ్మలా నిన్ను కన్నుల్లో చూపులా చూసుకోవాలనే నా చిన్ని ఆశ.. నేరవేరునో లేదో తెలియని ప్రశ్న గా మిగిలిపోయా ఇలా ..

love failure

a best flavoured coffee with sugar coated relation is called to be love. but this flavour is just an imagination in thoughts , because we love to act in life but never try to love anyone in life.. a boy loves a girl sincerely but doesn't know how to express, and at last  being alone missing her.. writes like this : waiting and waiting till the day ends darkness is growing up the night very tight silence is broken out in to the tears years are giving out the fear of feeling alone in love, loneliness as lust a dairy with her memories.. whitish papers are turned to be reddish// blood is evaporating in to the rain of tears I'm unable to move out of the situation you are still in the heart and everyday eating the beat but it doesn't stop you any more.. I'm struggling right now, making a wide angle of lens loosing it's power, whenever tears are filled off.. I'm not innovative to be introductory as great in front of you.. I can say ...

missing love

అలక కులుకులాపని ప్రేయసి... పలకరింపులకు  దూరమైతే రాక్షసి. ఉలుకు పలుకు లేక నడకలు పెడితే ఊర్వశి .. మనసు మనసులో లేక నీకై వెతికే నా మది .. నువ్వు  లేని రోజు నాకు తెలిసెను నిశి.. నా నవ్వుకు నువ్వే హాసిని .. చినుకై రాలనా  నిన్ను చేరుటకు.. చిరునవ్వై చేరనా  నీ పెదవులకు .. కన్నీరులా కరిగిన  నీ కనులకు రెప్పలా కాపాడుకోనా నీ వెంట పడుతూ.. అడుగునై రానా నీ వెంట మర్గాములా

నాన్న ఆశీస్సులతో ..!

Image
నువ్వు పోరాడే యోధుడివి.. నిన్ను మించిన సాధనము వేరోక్కటి లేదు నీకు నువ్వే రాసుకో ధైర్యాన్ని కాగితముగా మలిచి, సౌర్యాన్ని కాలంగా వలచి.. సంధించు గమ్య చేధనకై సరైన బాణాన్ని   ..  గెలుపే నిన్ను ప్రేమించి వెంటాడుతుంది

Lose or Win always a new part of your life story

Image
                                          https://www.facebook.com/aksharaharshini

love quotes

Image

విలువలు లేని సమాజం

Image

Happy National Youthday

Image

ఆధ్యాత్మికం !

Image
మిత్రులారా తెలుసుకోండి ! చాలామంది భగవద్గీత గురించి చాలా అపోహపడుతున్నారు , భగవద్గీతను ఇంట్లో వినకూడదని , అది మనిషి చనిపోయినప్పుడే పెడతారని, ఇలా ఎంతో మంది అనుకుంటున్నారు, నిజానికి భగవద్గీతను స్మశానలలో పెట్టకూడదు, భగవద్గీత అంటేనే జీవితం గురించి వర్ణించగల ఓ పవిత్ర గ్రంథం. ప్రశాంతతకు మూలం, మనిషి మనుగడలో నిరంతరం ఎదురయే సమస్యలను ఎదురుకోగలిగిన ధైర్యాన్ని, మనోబలాన్ని , బుద్ధి వికాసాన్ని కలిగిస్తుంది, ఇతర మతస్తులకు వారి గ్రంధాలూ ఎలానో, మనకు భగవద్గీత అలానే. అర్జునునికి ధర్మ సం దేహాలను తీర్చి, ధర్మాన్ని రక్షించాలనే వారి చెంత ఎప్పటికి నిలుస్తానని భగవద్గీతలో కృష్ణభగవానుడు సెలవిచ్చెను, కనుక మిత్రులారా , ధర్మాన్ని రక్షించే వాడిని దైవం రక్షించును, అలాంటి గొప్ప సందేశాలను గీతలో సావదాణముగా తెలిపిరి, అలాంటి భగవద్గీతను వినటము, చదవటము మంచిది కాదనే అపోహను మనసు నుండి తుడిచేసి , ధర్మాన్ని ఆచరిస్తూ, భగవద్గీతను చదువుతూ జ్ఞానాన్ని పొందగలరని ఆశిస్తున్నాను ..!! ఈ వాఖ్యాలను పదిమందికి తెలియచేయండి...!!

నాన్న..!

Image
భాద్యత కు అర్థం చెప్పే  రూపం నాన్న  జీవితాన్ని నిలబెట్టుకోవటానికి మనిషి పడే తపన  జీవితాన్ని  తీర్చిదిద్దటానికి ఓ మనిషి జీవించే నిదురలేని  రాత్రులెన్నో  ఆ మనిషి లో ప్రేమించడం అంటే జీవితాన్ని ఇవ్వటం అనే  అర్థం కనిపిస్తుంది. అతనే నాన్న!!   

Demoralised Society

Image

be practical..||

Image