relationship is always needs adjustments



బంధం బరువుగా అనుకునే వారికి , బంధాలు తెంచుకున్న వారికి, ఈ రోజు నేను రాసే కొన్ని మాటలు ఆలోచన కలిగిస్తే చాలు!!

ముందుగా, ఓ బంధం అనేది ఏర్పడటానికి కారణాలు ఎన్నో ఉంటాయి, విడిపోవటానికి కూడా ఉంటాయనుకోండి!!

కానీ ఓ మనిషికి బ్రతకటానికి డబ్బు తో పాటు బంధాలు కూడా అవసరం!!
...

కాలానికి అనుగుణంగా మనం మనతో ప్రేమగా ఉన్న వారితో గడిపిన క్షణాలను కూడా వదిలేస్తుంటామ్!! కొన్ని వృత్తి రిత్యా అవ్వొచ్చు, లేక మాట పట్టింపుల వల్లనో కావచ్చు మౌనంగా దూరంగా ఉండిపోతున్నాం!!

ఊపిరి పోసుకున్న దగ్గరి నుండి ఊపిరి ఆగేదాక అమ్మ అని , నాన్న అని అక్క, అన్న అని ఎన్నో బంధాలను పెనవేసుకుంటున్న మనం, స్నేహం-ప్రేమ అనే కారణాల వల్ల బిగువగా అనుబంధాలకు అల్లిక గా సాగిపోతున్నాం.కానీ ద్వేషం, అపార్థం, కోపం, మోసం, స్వార్థం అనే వాటికి చోటు ఇవ్వటం వలన ఎన్నో బంధాలు గతంగానే గతించి పోతున్నాయి. మీరు బాధ పడిన విషయం వలన కూడా కొందరిని దూరంగా ఉంచాల్సి వచ్చిండొచ్చు. ప్రేమ లేకుండా ద్వేషం, ద్వేషం రాకుండా అసహ్యం ఏర్పడదు. ప్రేమంటే అందులో మానవత్వం కూడా ఓ రకం, మనం పెంచుకొన్న నమ్మకం కూడా బంధాలకు పునాది. అప్యాయత లేనిదే బంధం మొదలవ్వదు., అలాంటి ఓ అద్భుతమైన భావానికి అహం అనే అడ్డుగోడలు కట్టి సమాధి చేస్తున్నారు,. ఒకరి లోపం నీకు నచ్చకపోవచ్చు అదే లోపం వల్ల నువ్వు విడిపోయిండొచ్చు, కానీ ఆ లోపాన్ని కూడా ప్రేమ తో సరిచేసుకోవచ్చు అనే ఓ కనించని సమాధానం, గుర్తుపట్టలేని ప్రశ్న గా మిగిలిన మీ అనుబంధాన్ని బ్రతికించే ఔషదం అని తెలుసుకుంటే,
ప్రతి ఒక్కరి జీవితం నాలుగు గోడల మధ్య కాకుండా నలువైపులా అహ్లాదకరంగా ఉంటుంది!!

కాబట్టి కష్టపడి నేను రాశాను అని కాకుండా, మీరు కష్టపడి ఇంత చదివారని కాకుండా, మీరు ఇష్టపడిన , ఇష్టపడుతున్న వారిని ఈరోజే పలకరించండి మనస్పూర్తిగా!!

గొడవ పడ్డ సంఘటనలను మనసులో దాచుకోవటం వలన ఉపయోగం లేదని తెలుకొని కలవటానికి మనసుతో ప్రయత్నం చేయండి. తప్పు ఎవరిదని లెక్కలేసుకోకుండా, బంధాల విలువ లెక్కలోకి తీసుకొని నేడే మీ వారికి చేరువ అవ్వండి!!

note : లోపాన్ని కూడా ప్రేమించడం మానవత్వం

మీరు నా మాటలకు విలువనిస్తే, మీరూ ఆచరించాలని అనుకుంటే, ఈ మెసేజ్ ని మరో స్నేహితుడికి షేర్ చేయండి!!
by Jayanth

Comments

Popular posts from this blog

love quotes