Mother's Love
తేనెలొలుకు పలుకులు నేర్పించు అమ్మ ప్రేమ మధురం..
చిట్టి కనులకు చంద్రుడి అందాలు చూపే అమ్మ ఆలన మధురం..
అలసిన మన కనురెప్పల పాపలకు అమ్మ ఒడి మధురం ..
కరుగుతున్న మన కన్నీరుకు అమ్మ లాలి పాట మధురం...
పడి లేచిన క్షణం మనకు చేయుతనిచే అమ్మ చెయ్యి మధురం..
గెలిచినా, ఓడినా మన వెంట నీడల ఉండే అమ్మ మనసు ఎంతో మధురం ..
అమ్మ..
అంతులేని ప్రేమ ఉందా?
అనే ప్రశ్నకు సమాధానం...
అమ్మ..
అలుపులేని ఆప్యాయతకు
నిదర్శనం
కనిపించని రూపం దేవుడు అయితే
కనిపించే దేవత అమ్మ...
కన్నీరులా కరిగిపోయినా, తన జీవితం
పర్లేదు నా బిడ్డ బాగుండాలి అని అనుకునే అమాయకపు అమృతవల్లి అమ్మ...
Comments
Post a Comment