Posts

Respect Women..!

Image
ఆడపిల్ల ఏడ కనపడినా, సమాజమే సమముగా పంచుకుంటుంది!! ... ఎవడి కూతురో లే, కామ వాంఛ తీరటానికి, దొరికితే చాలు దొరలా చెరిచి పోతావు!! అంగడి లో వస్తువు లా అణువనువు తడిమి చూస్తావు!! అమ్మపాల రొమ్ము ని కుమ్మే నీకు ఆడతనం గుర్చే కాని అందులోని అమ్మతనం చూడలేవు!! ఎవడిచ్చాడు నీకు మగతనం ?? అమ్మతనం నుండి రాలిన రక్తమాంసమే నువ్వు మరో ఆడపిల్ల ని ఆటబొమ్మ లా కాటేస్తున్నావ్!! See More respect women, without them we are out of the imagination.. advance happy women's day...!  -jayanth

love quotes (one year back written)

సమయం లేదు  అంటూనే.. సరదాగా నీతో గడపాలని నువ్వంటే నాకిష్టం అని చెప్పాలని ఉంది.. కాని దూరం నాకు  ప్రశ్న కాకపోయినా నీ మనసులోని అపార్థానికి సమాదానం దొరకని ప్రశ్నే నన్ను నా నుండి దూరం చేస్తుంది ...!! ప్రేమను ప్రేమిస్తున్న ప్రేమగా  తన ప్రేమకై నా ప్రేమను  నేను ప్రేమించట్లేదని అనుకోని ప్రేమను ప్రేమగా ప్రేమించట్లే దంటూనే   ప్రేమిస్తూ ప్రేమలో నేను ప్రేమనై ప్రేమకోసం నన్ను నేను ప్రేమించుకుంటున్న ప్రేమను ప్రేమించకనే.. !! 04 april 2015 ప్రేమించటం... విడిపోవటానికి అయితే  .. ప్రేమకేం విలువ ఉంటుంది.. విలువలు  నిలబెట్టలేని ద్వేషం.. ఎవరికోసం, ఎందుకోసం.. !! ప్రేమకోసం ఏదైనా వదిలెయ్యొచ్చు  కాని ప్రేమను కాదు.. ! 05 april 2015 అలుపు లేదు నా మనసుకు.. నీ ప్రేమలో.. కులుకు లేదు నా  కనులకు నీ ఊహలో ... పలుకు లేదు నా మాటకు .. నీ పలకరింపులో .. మరుపు లేదు నా ప్రేమకు.. నీ నీడలో .. మలుపు లేదు నా  పాదానికి .. నీ అడుగులలో ... నీ కోసమే నేను... నీలోనే నేను..!! 05 april 2015

relationship is always needs adjustments

Image
బంధం బరువుగా అనుకునే వారికి , బంధాలు తెంచుకున్న వారికి, ఈ రోజు నేను రాసే కొన్ని మాటలు ఆలోచన కలిగిస్తే చాలు!! ముందుగా, ఓ బంధం అనేది ఏర్పడటానికి కారణాలు ఎన్నో ఉంటాయి, విడిపోవటానికి కూడా ఉంటాయనుకోండి!! కానీ ఓ మనిషికి బ్రతకటానికి డబ్బు తో పాటు బంధాలు కూడా అవసరం!! ... కాలానికి అనుగుణంగా మనం మనతో ప్రేమగా ఉన్న వారితో గడిపిన క్షణాలను కూడా వదిలేస్తుంటామ్!! కొన్ని వృత్తి రిత్యా అవ్వొచ్చు, లేక మాట పట్టింపుల వల్లనో కావచ్చు మౌనంగా దూరంగా ఉండిపోతున్నాం!! ఊపిరి పోసుకున్న దగ్గరి నుండి ఊపిరి ఆగేదాక అమ్మ అని , నాన్న అని అక్క, అన్న అని ఎన్నో బంధాలను పెనవేసుకుంటున్న మనం, స్నేహం-ప్రేమ అనే కారణాల వల్ల బిగువగా అనుబంధాలకు అల్లిక గా సాగిపోతున్నాం.కానీ ద్వేషం, అపార్థం, కోపం, మోసం, స్వార్థం అనే వాటికి చోటు ఇవ్వటం వలన ఎన్నో బంధాలు గతంగానే గతించి పోతున్నాయి. మీరు బాధ పడిన విషయం వలన కూడా కొందరిని దూరంగా ఉంచాల్సి వచ్చిండొచ్చు. ప్రేమ లేకుండా ద్వేషం, ద్వేషం రాకుండా అసహ్యం ఏర్పడదు. ప్రేమంటే అందులో మానవత్వం కూడా ఓ...

love quotes

ఉరిమే మేఘము కరిగెను చినుకులా .. కురిసే వర్షము చేరెను ఆధారాలను నేరుగా.. నిదుర లేపెను ఒక కొత్త ఉదయం చల్లగా .. నేల  తడిచెను ఆకాశంలో  హరివిల్లు జారిపడెను .. మనసు అడిగెను అలాంటి రోజు ఎప్పుడూ  కావాలని .. చిరునవ్వు చిందులేసెను ఆనందానికి అంతులు  లేవని.. చిన్నారుల కేరింతలు , కోకిల సరిగమల రాగాలు ఎంత మధురం.. అలాంటి చల్లని చినుకులలో ఆనందమే కాదు బాధను కూడా ఆస్వాదించగలం.. వర్షాన్ని, వెన్నెల ని ఒకటిగా చూడాలనే నా కోరిక ఎప్పటికి తీరునో... అలసిన కనులకు అలరించే అందం నీవు ఉదయించిన నా కనురెప్పలకు ఊరించే ఊహవు నీవు .. కరిగిన నా కన్నీటి కనులకు ఓదార్చే కానుక నీవు.. కదిలిన నా పెదాలపై వర్షించే పదాల వర్షం నీవు.. నిదురించిన నా మనసుని కదిలించిన అలల అలజడి నీవు..

Mother's Love

Image
తేనెలొలుకు పలుకులు నేర్పించు అమ్మ ప్రేమ మధురం.. చిట్టి కనులకు చంద్రుడి అందాలు చూపే  అమ్మ ఆలన మధురం.. అలసిన మన కనురెప్పల పాపలకు అమ్మ ఒడి మధురం .. కరుగుతున్న మన కన్నీరుకు అమ్మ లాలి పాట మధురం... పడి లేచిన క్షణం మనకు చేయుతనిచే  అమ్మ చెయ్యి మధురం.. గెలిచినా, ఓడినా మన వెంట నీడల ఉండే అమ్మ మనసు ఎంతో మధురం .. అమ్మ.. అంతులేని ప్రేమ ఉందా? అనే ప్రశ్నకు  సమాధానం... అమ్మ.. అలుపులేని ఆప్యాయతకు నిదర్శనం కనిపించని రూపం దేవుడు అయితే కనిపించే దేవత అమ్మ... కన్నీరులా  కరిగిపోయినా, తన జీవితం పర్లేదు నా బిడ్డ బాగుండాలి అని  అనుకునే అమాయకపు అమృతవల్లి అమ్మ...

love at first sight

రవికిరణం నేల తాకినట్లు.. నీ ప్రేమ నా మనసు చేరే ప్రియతమా. చల్లని జాబిలి వెన్నెలలా.. నీ మోము కాంచిన  క్షణం నుంచి కునుకు కరువయ్యే కనులకు... మనసు బరువయ్యే ప్రేమ పెరిగి.. చిరునవ్వు వెతికే అటుఇటు నీకు అందించుటకు .. లాలించే అమ్మలా నిన్ను కన్నుల్లో చూపులా చూసుకోవాలనే నా చిన్ని ఆశ.. నేరవేరునో లేదో తెలియని ప్రశ్న గా మిగిలిపోయా ఇలా ..