Money measures everything

ప్రేమ జ్ఞాపకం   ఐనా పర్లేదు కాని  
మనిషి జ్ఞాపకం గా మారకూడదు    .. 

ఎందుకంటే, రూపం కంటి   ముందు నుండి కలగా మారితే 

కన్నీరు పెట్టినా తిరిగి రారని తెలిసాక..

మనసు లో  ఏదో తెలియని కలత, ఎవడో గుండెలో గునపం దింపినట్టుగా బాధ ..

మరణం అంటే శరీరాన్ని వదిలెయ్యటం కాదు.. మనసుని వదిలెయ్యటం.. 

జ్ఞాపకం మరిచిపోలేనిది అనుకుంటాం కాని అది జ్ఞాపకం కాదు క్షణక్షణం గుండె చప్పుడులోని వ్యాపకం అని  తెలిసినా ఎవరికీ చెప్పుకోలెం..

చావంటే, మనిషి పోవటం కాదు కుటుంబాన్ని కోల్పోవటం.. 

ఎదుటి వాడు మంచోడైనా, డబ్బు లేకుంటే మనోడు కాదు అన్నట్టుగా చూసే ప్రపంచం.

నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠం ఒక్కటే,  బంధాలు బలహీనమైనవి బలపడాలంటే  డబ్బు ఉండాలని ..!!

కాని నా జీవితంలో   స్నేహం  అనేది మాత్రం చాలా విలువైనది.. బాధలో ఓదార్పుగా,  హృదయానికి గుండె చోప్పుడులా ఉన్నారు.. బయటవారైనా ఆత్మ బంధువులు   వారే నాకు ఎప్పటికైనా!!     






Comments

Popular posts from this blog

love quotes