Popular posts from this blog
love quotes
ఉరిమే మేఘము కరిగెను చినుకులా .. కురిసే వర్షము చేరెను ఆధారాలను నేరుగా.. నిదుర లేపెను ఒక కొత్త ఉదయం చల్లగా .. నేల తడిచెను ఆకాశంలో హరివిల్లు జారిపడెను .. మనసు అడిగెను అలాంటి రోజు ఎప్పుడూ కావాలని .. చిరునవ్వు చిందులేసెను ఆనందానికి అంతులు లేవని.. చిన్నారుల కేరింతలు , కోకిల సరిగమల రాగాలు ఎంత మధురం.. అలాంటి చల్లని చినుకులలో ఆనందమే కాదు బాధను కూడా ఆస్వాదించగలం.. వర్షాన్ని, వెన్నెల ని ఒకటిగా చూడాలనే నా కోరిక ఎప్పటికి తీరునో... అలసిన కనులకు అలరించే అందం నీవు ఉదయించిన నా కనురెప్పలకు ఊరించే ఊహవు నీవు .. కరిగిన నా కన్నీటి కనులకు ఓదార్చే కానుక నీవు.. కదిలిన నా పెదాలపై వర్షించే పదాల వర్షం నీవు.. నిదురించిన నా మనసుని కదిలించిన అలల అలజడి నీవు..
Comments
Post a Comment