Posts
Showing posts from December, 2015
Love_Death
- Get link
- X
- Other Apps
మరణం వెనుక పడుతున్నా , బ్రతుకుతో బంధం తెగిపోయిందని! ప్రేమ అంటే తెలుసుకున్నా ప్రాణం కన్నా విలువైనదని! తనేమో నాలోనే ఉంది కానీ నేనే తనలో లేనని తెలుసుకొని తరలిపోతున్నా దూరాన్ని దగ్గరగా చేసుకుంటూ..! విలువలు వెతికితే కనిపించవు బంధాలు నటిస్తే నిలువవు డబ్బులు జోబిలోనే ఉండవు ప్రేమ మనసులోనే దాగలేదు త్యాగం ప్రేమలోనే పుడుతుంది
Money measures everything
- Get link
- X
- Other Apps
ప్రేమ జ్ఞాపకం ఐనా పర్లేదు కాని మనిషి జ్ఞాపకం గా మారకూడదు .. ఎందుకంటే, రూపం కంటి ముందు నుండి కలగా మారితే కన్నీరు పెట్టినా తిరిగి రారని తెలిసాక.. మనసు లో ఏదో తెలియని కలత, ఎవడో గుండెలో గునపం దింపినట్టుగా బాధ .. మరణం అంటే శరీరాన్ని వదిలెయ్యటం కాదు.. మనసుని వదిలెయ్యటం.. జ్ఞాపకం మరిచిపోలేనిది అనుకుంటాం కాని అది జ్ఞాపకం కాదు క్షణక్షణం గుండె చప్పుడులోని వ్యాపకం అని తెలిసినా ఎవరికీ చెప్పుకోలెం.. చావంటే, మనిషి పోవటం కాదు కుటుంబాన్ని కోల్పోవటం.. ఎదుటి వాడు మంచోడైనా, డబ్బు లేకుంటే మనోడు కాదు అన్నట్టుగా చూసే ప్రపంచం. నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠం ఒక్కటే, బంధాలు బలహీనమైనవి బలపడాలంటే డబ్బు ఉండాలని ..!! కాని నా జీవితంలో స్నేహం అనేది మాత్రం చాలా విలువైనది.. బాధలో ఓదార్పుగా, హృదయానికి గుండె చోప్పుడులా ఉన్నారు.. బయటవారైనా ఆత్మ బంధువులు వారే నాకు ఎప్పటికైనా!!