మిత్రులారా తెలుసుకోండి ! చాలామంది భగవద్గీత గురించి చాలా అపోహపడుతున్నారు , భగవద్గీతను ఇంట్లో వినకూడదని , అది మనిషి చనిపోయినప్పుడే పెడతారని, ఇలా ఎంతో మంది అనుకుంటున్నారు, నిజానికి భగవద్గీతను స్మశానలలో పెట్టకూడదు, భగవద్గీత అంటేనే జీవితం గురించి వర్ణించగల ఓ పవిత్ర గ్రంథం. ప్రశాంతతకు మూలం, మనిషి మనుగడలో నిరంతరం ఎదురయే సమస్యలను ఎదురుకోగలిగిన ధైర్యాన్ని, మనోబలాన్ని , బుద్ధి వికాసాన్ని కలిగిస్తుంది, ఇతర మతస్తులకు వారి గ్రంధాలూ ఎలానో, మనకు భగవద్గీత అలానే. అర్జునునికి ధర్మ సం దేహాలను తీర్చి, ధర్మాన్ని రక్షించాలనే వారి చెంత ఎప్పటికి నిలుస్తానని భగవద్గీతలో కృష్ణభగవానుడు సెలవిచ్చెను, కనుక మిత్రులారా , ధర్మాన్ని రక్షించే వాడిని దైవం రక్షించును, అలాంటి గొప్ప సందేశాలను గీతలో సావదాణముగా తెలిపిరి, అలాంటి భగవద్గీతను వినటము, చదవటము మంచిది కాదనే అపోహను మనసు నుండి తుడిచేసి , ధర్మాన్ని ఆచరిస్తూ, భగవద్గీతను చదువుతూ జ్ఞానాన్ని పొందగలరని ఆశిస్తున్నాను ..!! ఈ వాఖ్యాలను పదిమందికి తెలియచేయండి...!!